నూతన రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించిన కమిషనర్

నూతన రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించిన కమిషనర్

NLR: నెల్లూరు కమిషనర్ నందన్ పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా ఇవాళ రామలింగాపురం అండర్ బ్రిడ్జి ప్రాంతంలో పర్యటించారు. వర్షాలకు అండర్ బ్రిడ్జి ప్రాంతంలో వరద నీరు చేరుతుందని ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి పర్యవేక్షించారు. అనంతరం లెక్చరర్స్ కాలనీలో విద్యుత్ వీధి దీపాల నిర్వహణ, నూతన రోడ్ల నిర్మాణ పనులు, డ్రైన్ కాలువలలో పూడికతీత పనులను పరిశీలించారు.