జిల్లా నోడల్ అధికారికి ఉత్తమ అవార్డు

ASR: జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ జిల్లా నోడల్ అధికారి జీ.గౌరీ శంకరరావు ఉత్తమ అధికారిగా అవార్డు అందుకున్నారు. పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్-2 ప్రోగ్రాం అధికారిగా పనిచేస్తున్న ఆయన రక్తదాన శిబిరాలు నిర్వహించడం, మొక్కలు నాటడం తదితర సేవా కార్యక్రమాలు చేపట్టారు. శుక్రవారం పాడేరులో కలెక్టర్ దినేష్ కుమార్ ఆయనకు ఉత్తమ అవార్డు అందించారు.