జిల్లా కేంద్రంలో ఆగనున్న యశ్వంతపూర్-జబల్పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్

మహబూబ్ నగర్ పట్టణ రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. జిల్లా మీదుగా ప్రయాణించే జబల్ పూర్-యశ్వంతపూర్, యశ్వంతపూర్-జబల్ పూర్ ఎక్స్‌ప్రెస్ రైలును స్టేషన్లో ఆపనున్నారు. ఎంపీ డీకే అరుణ రైల్వే సమస్యలపై కేంద్ర రైల్వే మంత్రిని కలిసి ఇటీవల వినతి పత్రాన్ని సమర్పించగా ఆయన సానుకూలంగా స్పందించారు.