పొట్టి శ్రీరాములుకి నివాళులర్పించిన మంత్రి
ప్రకాశం: అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా సింగరాయకొండలో మంత్రి స్వామి, ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం 58 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన మహనీయుడని అన్నారు. దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పునాది వేసిన ఆయన స్ఫూర్తి ఈ తరం యువతకు స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.