VIDEO: మంత్రి చొరవతో చెరువు కట్ట పనులు ప్రారంభం

సత్యసాయి: సోమందేపల్లి చెరువు కట్ట పనుల ఆయకట్టు అధ్యక్షులు వడ్డే నారాయణ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. ఆదివారం చెరువు కట్టమీద ఉన్న ముళ్లపోదలు, పిచ్చి మొక్కలను తొలగించేందుకు మంత్రి సవిత రూ. 1లక్ష మంజూరు చేసినట్టు ఆయన తెలిపారు. చెరువు అభివృద్ధికి రూ. 50 లక్షలు మంత్రి ద్వారా ప్రతిపాదనలు పంపామని, సోమందేపల్లి చెరువుకు పూర్వ వైభవం తెస్తామని తెలిపారు.