'మున్సిపాలిటీని అప్ గ్రేడ్ చేసేందుకు కృషి చేస్తాం'
NTR: జగ్గయ్యపేట మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎంపీ కేసినేని చిన్ని శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగ్గయ్యపేట మున్సిపాలిటీని గ్రేడ్ 2 నుండి అప్ గ్రేడ్ చేసేందుకు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్, మున్సిపల్ ఛైర్మన్ రాఘవేంద్ర తదితర అధికారులు పాల్గొన్నారు.