VIDEO: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన అధికారులు
MDK: రేగోడ్ మండలం చౌదర్‌పల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని IKP APM సాయిలు, సీసీ మంజుల సందర్శించారు. కొనుగోలు చేసిన ధాన్యం నిల్వ, తేమ శాతం, బరువు నమోదుపై అధికారులు సమగ్రంగా పరిశీలించారు. కేంద్రంలో ఉన్న వసతులు, శుద్ధి నీరు, తూకం యంత్రాల పనితీరుపై నిర్వాహకులను అడిగి వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో VOA శిరీష పాల్గొన్నారు.