డిప్యూటీ సీఎం కార్యాలయం ఎదుట అంగన్వాడీల ఆందోళన

KMM: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మధిరలోని Dy.CM భట్టి క్యాంప్ కార్యాలయం ముందు సోమవారం అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ధర్నా నిర్వహించారు. వేతనాలు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న బకాయిలు వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు పోరాటం కొనసాగిస్తామని అంగన్వాడీ కార్యకర్తలు హెచ్చరించారు.