వ్యవసాయ కార్యాలయం వద్ద రైతుల ఆందోళన
NLG: దేవరకొండ వ్యవసాయ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. యూరియా వచ్చిందని తెలిసిన రైతులు గురువారం సహకార సంఘం దేవరకొండ వ్యవసాయ కార్యాలయం వద్దకు ఒక్కసారిగా చేరుకున్నారు. యూరియా కోసం లైన్‌లో నిలబడ్డారు. కాగా యూరియా లేదని అధికారులు చెప్పడంతో రైతులు ఆందోళన దిగారు. దేవరకొండకు 400బస్తాలు యూరియా వచ్చినా పంపిణీ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.