'ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలి'

ELR: ఫ్రీ బస్సుతో నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ప్రభుత్వం నెలకు రూ.10వేలు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని సీఐటీయూ మండల కార్యదర్శి సాయికిరణ్ డిమాండ్ చేశారు. కుక్కునూరులో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సాయికిరణ్ మాట్లాడారు. కరోనా సమయం నుంచి ఆటో డ్రైవర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.