ఆర్‌సీబీకి భారీ షాక్.. స్టార్ పేసర్ దూరం!
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే RCB జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ గాయం కారణంగా మొదటి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదని సమాచారం. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, హేజిల్‌వుడ్ ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో SRH, CSKతో జరిగే కీలక మ్యాచ్‌లకు అతడు దూరమయ్యే అవకాశం ఉంది.