నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా: సర్పంచ్ అభ్యర్థి
BDK: చర్ల మండలంలో సీపీఐ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా సోయం కృష్ణవేణి నామినేషన్ వేశారు. ఆమె మాట్లాడుతూ.. పదవి ఉన్న లేకున్నా ప్రజా సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజల అభీష్టానం మేరకు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగిందని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు చేస్తానని హామీ ఇచ్చారు.