ట్రాఫిక్ నియమాలను పోలీసులు పాటించాలి

ELR: ఏలూరు మూడో పట్టణ పోలీస్ సిబ్బందికి హెల్మెట్లను ఏలూరు రేంజ్ ఐజి జీవిజి అశోక్ కుమార్ బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు భద్రత నియమాల పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు కచ్చితంగా పాటించాలన్నారు. పోలీసు సిబ్బందే మొదటిగా ఈ నియమాలకు ఆదర్శంగా ఉండాలని సూచించారు.