నివాస గృహాల్లో అస్థికల నిల్వ నేరం: చైనా

నివాస గృహాల్లో అస్థికల నిల్వ నేరం: చైనా

చైనాలో స్మశానాల ధరలు పెరగడంతో, అస్థికలను దాచడానికి ప్రజలు బోన్-యాష్ అపార్ట్‌మెంట్లను వాడుతున్నారు. స్మశానం కంటే ఇల్లే చౌకగా ఉండటంతో ఈ వింత పద్ధతి మొదలైంది. అయితే, దీనిపై ప్రభుత్వం ఇప్పుడు నిషేధం విధించింది. మానవ అవశేషాలను కేవలం స్మశానాల్లోనే ఉంచాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. నివాస గృహాలను ఇలా వాడటం సరికాదని స్పష్టం చేశారు.