VIDEO: 'అమరావతిలో గ్యాస్ కొరత లేదు'
PLD: అమరావతి మండలంలో గ్యాస్ కొరత లేదని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ ప్రోప్రైటర్ మురళీమోహన్ స్పష్టం చేశారు. ఒకేసారి అందరూ ఆన్‌లైన్ బుకింగ్ చేయడం వల్ల సర్వర్ బిజీగా వస్తోందని, దీనిపై ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు. ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకున్న రెండు రోజుల్లోనే డెలివరీ బాయ్ ఇంటికి వచ్చి సిలిండర్ అందిస్తారని ఆయన భరోసా ఇచ్చారు. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దన్నారు.