కూటమితో బీసీలకు బంగారు భవిష్యత్తు: కోండ్రు

శ్రీకాకుళం: సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలోని బీసీల పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయని టీడీపీ రాజాం ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీ మోహన్ అన్నారు. వంగర మండలం అరసాడ గ్రామంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వంలో బీసీల కోసం రూ. 36వేల కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేశారు.