VIDEO: 'స్క్రబ్ టైఫస్‌పై అవగాహన కలిగి ఉండాలి'
అన్నమయ్య: స్క్రబ్ టైఫస్ అంటువ్యాధి కాదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని DY DMHO మహమ్మద్ రఫీ తెలిపారు. మంగళవారం మదనపల్లి మండలం బొమ్మనచెరువులో 104 సేవల కార్యక్రమాన్ని నిర్వహించారు. స్క్రబ్ టైఫస్ లక్షణాలు, నివారణ చర్యలను ప్రజలకు వివరించారు. జ్వరం, ఒంటి నొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.