అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు: మంత్రి

కోనసీమ: ప్రజలకు సేవలు అందించాల్సిన అధికారులు విధుల్లో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. గురువారం రామచంద్రపురం 1వ వార్డులో ఉన్న టిడ్కో గృహ సముదాయంలో అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. టిడ్కో గృహాల్లో ఉన్న సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించబనని అన్నారు.