ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని దర్శించుకున్న కలెక్టర్, ఎస్పీ

KDP: ఆంధ్ర భద్రాద్రిగా వెలసిన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌లు సందర్శించారు. వేద పండితులు ఆలయ సంప్రదాయాలతో వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు.