VIDEO: క్షీరారామంలో లక్ష దీపోత్సవం
W.G: పవిత్ర కార్తీక మాసం సందర్భంగా పంచారామక్షేత్రం పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం రాత్రి లక్ష దీపోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వివిధ రకాల ఆకృతులతో నేతి దీపాలను వెలిగించి దీపారాధన చేశారు. ఈ కార్యక్రమాన్ని ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు పర్యవేక్షించారు.