వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు

వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు

కోనసీమ: కె.గంగవరం మండలం దంగేరు గ్రామానికి చెందిన సుమారు 70 మంది వైసీపీ కార్యకర్తలు ఇవాళ కూటమి సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం, ఏఎంసీ ఛైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్ సమక్షంలో టీడీపీలో చేరారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పరిపాలన దక్షత, ప్రజలకు అందిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు తమను ఎంతో ఆకర్షించి పార్టీలో చేరామని వారు తెలిపారు.