'ఆడపిల్లలు చదువుకు దూరం కాకూడదు'

'ఆడపిల్లలు చదువుకు దూరం కాకూడదు'

ADB: పట్టణంలోని MPSS ప్రభుత్వ పాఠశాలలో 'బేటీ బచావో-బేటీ పడావో' కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు చదువు ప్రాముఖ్యతపై శనివారం అవగాహన కల్పించారు. సంస్థ ప్రతినిధి రాము మాట్లాడుతూ.. ఆడపిల్లలు చదువుకు దూరం కాకుండా తల్లిదండ్రులు పాఠశాలకు పంపాలన్నారు. ఈ మేరకు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు కొనసాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులున్నారు.