VIDEO: పద్మాక్షి ఆలయంలో నవాహ్నిక పుష్పయాగం
HNK: వసంత నవరాత్రి వేడుకలను పురస్కరించుకొని పద్మాక్షి ఆలయంలో ఆలయ పూజారి నాగేళ్ల షణ్ముఖ పద్మనాభ అవధాని ఆధ్వర్యంలో నవాహ్నిక పుష్పయాగం నిర్వహించారు. సుగంధ గులాబీలతో అమ్మవారికి పుష్పార్చన చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఆలయ పూజారులు భక్తులకు ఆశీర్వచనం చేసిన అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.