కుంటినవలసలో అగ్నిప్రమాదం

కుంటినవలసలో అగ్నిప్రమాదం

VZM: మెంటాడ మండలం కుంటినవలస గ్రామంలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన సీరంరెడ్డి పైడిపినాయుడుకు చెందిన రెండు ట్రాక్టర్ల గడ్డి కాలిపోవడంతో పదివేల రూపాయలు ఆస్తి నష్టం జరిగింది. విద్యుదాఘాతం కారణంగా ప్రమాదం జరిగిందని ప్రజలు చెబుతున్నారు. అగ్నిమాపక కేంద్రం అధికారి రవి ప్రసాద్ మంటలను అదుపు చేశారు.