గ్రామంలో మరకత శివలింగం ఊరేగింపు

గ్రామంలో మరకత శివలింగం ఊరేగింపు

SRD: కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో మరకత శివలింగాన్ని గ్రామమంతా ఊరేగిస్తూ శివాలయానికి చేర్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధాంతి శ్రీ మహేశ్వర శర్మ మాట్లాడుతూ.. గ్రామంలో ఇలాంటి గొప్ప క్షేత్రం ఏర్పడటం ప్రజల అదృష్టమని కొనియాడారు. భవిష్యత్తులో ఈ ఆలయం అత్యంత ప్రసిద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భక్తుల సమక్షంలో ఈ ఊరేగింపు వైభవంగా సాగింది.