అహోబిలం పారువేటకు యునెస్కో గుర్తింపు డిమాండ్
NDL: అహోబిలం పారువేట ఉత్సవానికి యునెస్కో వారసత్వ గుర్తింపు కల్పించాలని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పార్లమెంటులో గురువారం కోరారు. నల్లమల అటవీ ప్రాంతంలోని ఈ చారిత్రక ఉత్సవ ప్రాముఖ్యతను కేంద్రానికి వివరించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని అహోబిలం సంప్రదాయాలను ప్రపంచం గుర్తించాలని, ఈ ఉత్సవానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావాలని ఆమె విజ్ఞప్తి చేశారు.