ఆశా కార్యకర్త సకాలంలో స్పందించడంతో మగబిడ్డ ప్రసవం
VZM: మెంటాడ మండలం లక్ష్మిపురం గ్రామానికి చెందిన ఎం. పార్వతి మంగళవారం పురిటి నొప్పులతో బాధపడుతుంది. సహాయం కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. నదిని దాటే సాహసం చేయలేక.. రవాణా సౌకర్యం లేకపోవడంతో ఆందోళన చెందారు. ఈ క్రమంలో ఎఎన్ఎం, ఆశా కార్యకర్త సకాలంలో వచ్చి గజపతినగరం ఆసుపత్రికి అంబులెన్స్ తరలించి, ఆపరేషన్ చేసి మగబిడ్డను ప్రసవించింది.