కుప్ప కూలిన గుడిసె.. తప్పిన ప్రమాదం

కుప్ప కూలిన గుడిసె.. తప్పిన ప్రమాదం

MLG: మంగపేట మండలం రమనక్కపెటకి చెందిన సాదనపల్లి సారమ్మకి చెందిన పూరిగుడిసె ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి బుధవారం నేలమట్టమైంది. శబ్దం రావడంతో బయటకు వచ్చి త్రుటిలో తప్పించుకుంది. ఈ ఘటనలో వంట సామాగ్రి, నిత్యావసర వస్తువులు ధ్వంసమై లక్ష యాబై వేల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితురాలు వాపోయింది.