రంగాపూర్‌లో ఇంటింటికి సౌర విద్యుత్

రంగాపూర్‌లో ఇంటింటికి సౌర విద్యుత్

RR: రంగాపూర్‌లో PM సూర్యఘర్ పథకం కింద ఇంటింటికి సౌర విద్యుత్ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు సర్పంచ్ నేనవత్ బాలకృష్ణ తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా రంగాపూర్ గ్రామం ఎంపికైందన్నారు. బుధవారం గ్రామాన్ని సందర్శించిన ఓ ప్రైవేట్ కంపెనీ ప్రతినిధితో ఫైలట్ ప్రాజెక్టు అమలుపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పురుషోత్తం రెడ్డి పాల్గొన్నారు.