తడి-పొడి చెత్త వేర్వేరు సేకరణపై అవగాహన

తడి-పొడి చెత్త వేర్వేరు సేకరణపై అవగాహన

RR: చేవెళ్ల మండలంలోని అంతారం గ్రామంలో ఆదివారం తడి, పొడి చెత్త సేకరణ పై గ్రామస్తులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ రామస్వామి, ఉపసర్పంచ్ వెంకటేష్ బాబు గ్రామంలోని పలు వీధుల్లో పర్యటిస్తూ తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా అందజేయాలని ప్రజలకు సూచించారు. చెత్తను ఖాళీ ప్రదేశాల్లో వేయకూడదని ప్రజలకు తెలిపారు.