వైఎస్ షర్మిలతో పార్టీ జిల్లా ఇన్‌ఛార్జ్ భేటీ
PPM: జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ బత్తిన మోహన్ ఇవాళ విజయవాడ పార్టీ కార్యాలయంలో APCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను కలిశారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో పార్టీ పరిస్థితులు, బలోపేతం కోసం చేస్తున్న చర్యలు, కొత్త నియామకాలపై చర్చించారు. SC, ST నాయకులకు DCC బాధ్యతలు ఇవ్వాలని సూచించగా ఈ ప్రతిపాదనను AICC దృష్లికి తీసుకెళ్తానని ఆమె హామీ ఇచ్చారని తెలిపారు.