సింగూర్ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద

సింగూర్ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద

SRD: పుల్కల్ మండలం సింగూర్ ప్రాజెక్టుకు 39,009 క్యూసెక్కుల భారీ వరద కొనసాగుతుందని మంగళవారం ఉదయం ప్రాజెక్టు అధికారులు తెలిపారు. గత మూడు రోజుల నుంచి 5 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు 40,821 క్యూసెక్కులు వదులుతున్నారు. అదేవిధంగా జెన్కో కరెంట్ ఉత్పత్తికి 2,105 క్యూసెక్కులు, HMWSకు, మొత్తం కలిపి 43,466 క్యూసెక్కులు ఔట్ ఫ్లో ఉందని వివరించారు.