VIDEO: 'డ్రైనేజ్ మరమ్మతులు వెంటనే చేపట్టాలి'
WGL: నర్సంపేట పట్టణంలోని NTR నగర్ కాలనీలో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురికి నీరు రోడ్లపై నిలిచి దుర్వాసన వ్యాపిస్తోంది. సమస్యలపై అధికారులకు పలుమార్లు వినతులు ఇచ్చినా స్పందన లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే రోడ్లు, డ్రైనేజీ మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.