బైండోవర్ ఉల్లంఘిస్తే రూ.5 లక్షల జరిమానా : సీఐ

బైండోవర్ ఉల్లంఘిస్తే రూ.5 లక్షల జరిమానా : సీఐ

SRPT: చింతలపాలెం మండలం కిష్టాపురంలో ఎన్నికల నియమావళిపై కోదాడ రూరల్ సీఐ ప్రతాప్ లింగం అవగాహన కల్పించారు. వర్గ విభేదాలకు పోతే సమస్యలు తప్పవని హెచ్చరించారు. బైండోవర్ అనేది సత్ప్రవర్తనతో మెలుగుతామని ఇచ్చే హామీ అని వివరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5 లక్షల వరకు జరిమానా ఉంటుందని ఆయన హెచ్చరించారు.