గ్యాస్​ కట్టర్​తో సూపర్​ మార్కెట్​ తాళాలు ధ్వంసం..

గ్యాస్​ కట్టర్​తో సూపర్​ మార్కెట్​ తాళాలు ధ్వంసం..

NZB: రెంజల్ మండలం సాటాపూర్ గ్రామంలో ఎంఎన్​ఆర్​ సూపర్ మార్కెట్​ లో దొంగలు చోరీకి యత్నించారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో సూపర్ మార్కెట్ వద్దకు చేరుకున్న దొంగలు గ్యాస్ కట్టర్​తో తాళాలు కట్ చేశారు. సూపర్​ మార్కెట్​ ఓనర్​ పాషా ఆ సమయంలో లోపలే ఉన్నారు. అలికిడికి ఆయన నిద్ర లేచి కేకలు పెట్టాడు. అంతేగాకుండా పోలీసులకు సమాచారం అందించాడు.