రామప్ప ఆయకట్టులో నేలకొరిగిన వరి పంట

MLG: వెంకటాపూర్ మండలం పాలంపేట రామప్ప సరస్సు ఆయకట్టు శివారులో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి వరి పంట నేలకొరిగింది. వేల ఎకరాల్లో వరి పంట నేలకొరిగిందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజుల్లో పంట కోతకు వచ్చే దశలో అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని కలగజేసింది. అధికారులు స్పందించి పంట నష్టపరిహారం అంచనా వేయాలని రైతులు కోరుతున్నారు.