లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి: ఎస్పీ

లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి: ఎస్పీ

SRCL: ఈ నెల 28న జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని SP మహేష్ బి.గీతే సూచించారు. దీంతో క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు, సివిల్ వివాదాలు, ఆస్తి విభజన, చెక్ బౌన్స్, డ్రంక్ అండ్ డ్రైవ్ అలాగే ఇతర రాజీ పడదగిన కేసులను సులభంగా పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా బాధితులకు త్వరితగతిన న్యాయం అందుతుందని ఎస్పీ పేర్కొన్నారు.