ధాన్యం సేకరణకు ప్రణాళికబద్ధమైన చర్యలు: జేసీ

ధాన్యం సేకరణకు ప్రణాళికబద్ధమైన చర్యలు: జేసీ

కాకినాడ జిల్లాలో 2025-26 ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం సేకరణ ప్రక్రియను ప్రణాళికబద్ధంగా నిర్వహించేందకు అవసరమైన చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్‌లో ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణ సన్నద్ధతలో భాగంగా అనుసరించాల్సిన విధానాలపై ఆయన జిల్లా స్థాయి ధాన్యం కొనుగోలు కమిటీ సమావేశం నిర్వహించారు.