పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే
W.G: మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామం గెదలవంపు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను గురువారం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా చిన్నారులకు భోజనం వడ్డించి, వారితో కలిసి భోజనం చేశారు. పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతో అవసరం అన్నారు.