'ఉదండాపూర్ నిర్వాసితుల ప్లాట్లను వేగవంతంగా పూర్తి చేయండి'

MBNR: జడ్చర్ల పట్టణం ఉదండాపూర్ నిర్వాసితులకు కేటాయించిన ప్లాట్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ, ఇరిగేషన్, ల్యాండ్ సర్వే, మిషన్ భగీరథ అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్వాసితులకు కేటాయించిన ప్లాట్ల ప్రాంతంలో మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.