బీఎల్అర్ బర్త్ డే సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్
MDCL: ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పుట్టిన రోజు సందర్భంగా నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాచారం ప్రాంతానికి చెందిన వికలాంగుడు శోభన్‌కు రూ. 1.10 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన మూడు చక్రాల జుపిటర్ స్కూటర్‌ను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు.