మట్టి అక్రమ తరలింపుపై ఫిర్యాదు
NLG: నాంపల్లి మండలం నేరళ్లపల్లి పంచాయతీ పరిధిలోని మూలగుట్ట సమీపంలో ఉన్న మట్టిని అనుమతులు లేకుండా కాంట్రాక్టర్ అక్రమంగా తరలిస్తున్నారని స్థానికులు సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. గ్రామ మైనింగ్ సంపదను అక్రమంగా దోచుకెళ్తున్నారని, వెంటనే తరలింపును ఆపి, సదరు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిప్యూటీ తహసీల్దార్‌ను కోరారు.