'గుర్తు'పైనే జీపీ అభ్యర్థుల దృష్టి
SDPT: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలపై పేర్లు కాకుండా కేవలం గుర్తులు మాత్రమే ఉండటంతో అభ్యర్థులు తమ గుర్తును గుర్తుంచుకోవాలని ఓటర్లను ప్రత్యేకంగా కోరుతున్నారు. ఎక్కువ మంది పోటీలో ఉన్న పంచాయతీల్లో ఈ గందరగోళం పెరుగుతోందని అభ్యర్థులు వాపోతున్నారు. మూడు నుంచి ఎనిమిది మంది పోటీ పడుతున్న గ్రామాల్లో తమ గుర్తులను ఓటర్లకు స్పష్టంగా తెలియజేయడం తప్పనిసరి.