సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే

SRPT: నూతనకల్ మండలం చిల్పకుంట్లలో స్థానిక సమస్యలపైన సీపీఎం ఆధ్వర్యంలో మూడు బృందాలుగా ఏర్పడి శనివారం ఇంటింటి సర్వే నిర్వహించారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి సర్వే నిర్వహించామని సీపీఎం మండల కార్యదర్శి శంకర్ రెడ్డి అన్నారు. స్థానిక సమస్యలో భాగంగా నిజమైన అర్హులకు వృద్ధాప్య, వితంతు పెన్షన్లు రావడం లేదని తెలిపారు.