అభివృద్ధి పనులను ప్రారంభించిన మేయర్
KMM: పట్టణం 46వ డివిజన్‌లో సుమారు రూ.29.50 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో సీసీ రోడ్లు నిర్మాణ పనులకు బుధవారం మేయర్ పునుకొల్లు నీరజ శంకుస్థాపన చేశారు. స్థానిక జూబ్లీపుర, సారథి నగర్ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ప్రజలు సహకరించాలని మేయర్ కోరారు. అభివృద్ధి విషయంలో మంత్రి తుమ్మల ఎన్ని నిధులైన ఇస్తారని ఆమె అన్నారు.