మంగళంలో గొడవ.. పలువురికి గాయాలు

CTR: పుంగనూరు మండలం మంగళంలో శుక్రవారం రాత్రి భూ వివాదం నేపథ్యంలో రెండు వర్గాలు గొడవకు దిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ గొడవలో పలువురు గాయపడగా వారిని పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.