రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు

BPT: బాపట్ల శివారులో గురువారం ఒక ప్రభుత్వ ఉద్యోగి తన కారుతో బుల్లెట్‌ను ఢీకొట్టి పరారైన సంఘటన తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ ప్రమాదంలో బుల్లెట్ నడుపుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడి, నడవలేని స్థితిలో పడిపోయాడు. బుల్లెట్ కూడా పూర్తిగా ధ్వంసమైంది. బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగి ఇలా ప్రవర్తించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.