'జువ్వల పోటీకి పాల్పడితే కఠిన చర్యలు'

'జువ్వల పోటీకి పాల్పడితే కఠిన చర్యలు'

VZM: నగర పంచాయతీ, రూరల్ మండలంలోని గ్రామాల్లో ఎక్కడైనా దీపావళి రోజున జువ్వల పోటీలకు పాల్పడే యువతపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై గణేష్ హెచ్చరించారు. నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేట, మొయిద జంక్షన్, రామతీర్థం జంక్షన్‌తో పాటు సారిపల్లి గ్రామంలో జువ్వల పోటీలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. ఆయా ప్రాంతాలపై దృష్టి పెట్టామని పేర్కొన్నారు.