నేడు గుడిహత్నూర్‌లో పర్యటించనున్న ఎంపీ
ADB: గుడిహత్నూర్ మండలంలో ఆదిలాబాద్ MP గోడం నగేశ్ ఆదివారం పర్యటిస్తున్నట్లు బీజేపీ మండల అధ్యక్షుడు కేంద్రీ శివాజీ తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.