కంది రైతులకు రాయితీపై మందుల పంపిణీ

కంది రైతులకు రాయితీపై మందుల పంపిణీ

ప్రకాశం: బేస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామంలో సోమవారం "ఆహారం మరియు పోషకాహార భద్రత" కార్యక్రమంలో భాగంగా ఖరీఫ్‌లో కంది పంట వేసిన రైతులకు పురుగుమందుల పంపిణీ మండల వ్యవసాయ అధికారి జక్కం మెర్సీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులందరూ ఈ పథకాన్ని సద్వినియోగపరచుకోవాలని తెలియజేశారు.